నల్గొండలో కాలిన మృతదేహం కలకలం

by Sumithra |   ( Updated:2020-10-09 02:45:54.0  )

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో కాలిన మృతదేహం కలకలం రేపింది. పెద్దఅడిశర్లపల్లి మండలం గట్టు నెమలిపురం గ్రామ సమీపంలో గుర్తుతెలియని, కాలిన మృతదేహం లభ్యం కావడం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం ఉదయం కొందరు స్థానికులు పనుల నిమిత్తం వెళుతుండగా మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే 9440795603 ఈ నెంబర్‌కు సమాచారం ఇవ్వండి అని గుడిపల్లి ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story