బ్రాండ్ న్యూ బుర్జ్ ఖలీఫా.. రంజాన్‌కు స్పెషల్ లైటింగ్ షో డిజైన్

by Shyam |
బ్రాండ్ న్యూ బుర్జ్ ఖలీఫా.. రంజాన్‌కు స్పెషల్ లైటింగ్ షో డిజైన్
X

దిశ, ఫీచర్స్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రంజాన్ వేడుకలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు పెయిడ్ హాలీడేస్ ప్రకటించగా.. పలు రెస్టారెంట్లు స్పెషల్ ఈద్ మీల్ డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. వీటితోపాటు ఈద్‌ స్పెషల్‌గా దుబాయ్ కామెడీ ఫెస్టివల్, హాలోగ్రామ్ కన్సర్ట్‌లు కూడా ప్లాన్ చేశారు. కాగా యూఏఈ ప్రపంచంలోనే ఈ పండుగను గొప్పగా జరుపుకునేందుకు మరో స్పెషల్‌ డిజైన్ చేసింది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను స్పెషల్ షోస్‌తో లైట్ అప్ చేయనుంది.

లాంగ్ వీకెండ్ ఈ షో జరగనుండగా.. ఈ బ్రాండ్ న్యూ బుర్జ్ ఖలీఫా షోకు యూఏఈ రెసిడెంట్స్ అండ్ విజిటర్స్ సాక్ష్యంగా నిలవనున్నారు. ‘ఎస్మాహా దుబాయ్’ అనే స్పెషల్ టైటిల్ ట్రాక్‌తో ఈ లైటింగ్‌ షోను కొరియోగ్రఫీ చేయగా.. ఎమిరాటి మ్యూజిక్ డైరెక్టర్, దర్శకుడు మొహమ్మద్ అల్ అహ్మద్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. రా. 8 గంటల నుంచి ప్రారంభం కానున్న షో లాంగ్ వీకెండ్ ప్రదర్శించబడనుంది. కేవలం బుర్జ్ ఖలీఫా మాత్రమే కాదు దుబాయ్ ఫౌంటేన్ కూడా ‘ఎస్మాహా దుబాయ్’ స్పెషల్ ట్రాక్‌పై డ్యాన్స్ చేయనుంది.

Advertisement

Next Story