- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటో పరిశ్రమ వృద్ధి పై ఆశలు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా స్వల్పకాలిక సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ దీర్ఘ కాలిక వృద్ధి అవకాశాలపై ఆశావహంగానే ఉందని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో 50 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న మారుతీ సుజుకి ఆర్థిక ఆటోమొబైల్స్ దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిశీలిస్తే అది ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటుందని గమనించాం. ఈ విభాగంలో దీర్ఘకాలిక దృక్పథం ఆర్థిక వృద్ధిపై ఆధారపడి ఉంటుందని మారుతీ సుజుకి ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా మారితే మార్కెట్ బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని, వృద్ధిపై భరోసాను కలిగి ఉన్నామని చెప్పారు. అయితే, స్వల్పకాలంలో దీన్ని ఆశించడం కష్టమని శశాంక్ వివరించారు. కొవిడ్-19కి ముందున్న స్థాయిలో ఉత్పత్తి, అమ్మకాలు చేరుకునేందుకు చాలా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జూలై అమ్మకాలు గతేడాది ఇదే నెలతో సమానంగా నమోదవగా, ఆగస్టు అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 20 శాతం మెరుగ్గా ఉన్నాయన్నారు. అయితే, గణాంకాలను మేము పరిగణలోకి తీసుకోవడంలేదని, గతేడాదిలోనే అంతకుముందు నాటితో పోలిస్తే తక్కువ కాబట్టి, మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయని పేర్కొన్నారు.
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రిటైల్ స్థాయిలో స్టాక్‌ను పెంచేందుకు కంపెనీ ఈ నెలలో ఉత్పత్తిని పెంచుతున్నట్టు శశాంక్ తెలిపారు. భారత్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ ఆదాయ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. తక్కువ ఆదాయ స్థాయిల కారణంగా వినియోగదారులు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఈ రంగంలో విస్తరణకు నిధులను ఖర్చేయడం ముఖ్యమని భావిస్తున్నట్టు శశాంక్ పేర్కొన్నారు.