పరిటాల రవి కుమారుడి బ్యాగులో బుల్లెట్.. అధికారులకు అడ్డంగా దొరికిపోయి

by Anukaran |
పరిటాల రవి కుమారుడి బ్యాగులో బుల్లెట్.. అధికారులకు అడ్డంగా దొరికిపోయి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం రేపింది. టీడీపీ మాజీమంత్రి పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్దార్థ బ్యాగులో 5 ఎంఎం బుల్లెట్‌ బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. పరిటాల రవీంద్ర, పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ గురువారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు బయల్దేరి వెళ్తుండగా సీఐఎ్‌సఎఫ్‌ అధికారులు తనిఖీలు చేశారు.

విమానాశ్రయ అధికారులు బ్యాగ్‌ను స్కానింగ్‌ చేసిన నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్‌ బుల్లెట్‌ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ బులెట్ పై వివరణ ఇవ్వాలని అధికారులు సిద్దార్థని కోరినట్లు తెలుస్తోంది. తనకు అనంతపురంలో లైసెన్సు గన్ ఉందని, అయితే దానికి అవసరమైన పత్రాలు తన వద్ద లేవని సిద్ధార్థ చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా తన బ్యాగులోకి ఆ బుల్లెట్ ఎలా వచ్చిందో తెలియదని తెలిపారు. దీంతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు.



Next Story