- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భైంసాలో టెన్షన్ టెన్షన్ : వాగులో చిక్కుకున్న నిండు గర్భిణీ..
దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నిర్మల్, భైంసాలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. నీటిలో చిక్కుకున్న వారిని నాటు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే నేరుడుగొండ మండలంలోని నేరేడు గొండ వాగులో ఓ నిండు గర్భిణీ చిక్కుకుంది. వైద్యం కోసం ఎడ్లబండిలో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ సమయంలో నేరేడుగొండ వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఎడ్లబండి ముందుకు కదలలేదు. వరద ప్రవాహానికి ఎద్దులు భయపడి ముందుకు కదిలేందుకు మొరాయించాయి.
ఎలాగోలా శ్రమించి గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించగా.. ఉన్నట్టుండి ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా నిర్మల్‌లోని సిద్ధాపూర్ జీఎన్‌ఆర్ కాలనీ మొత్తం వరదలో చిక్కుకున్నది. ఇప్పటికే అక్కడ 40 మంది నీటిలో చిక్కుకోగా నాటు పడవల సాయంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అంతేకాకుండా ఓ ఆటో కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.