కోటి రూపాయల ఎద్దు.. వీర్యానికి ఫుల్ డిమాండ్..

by Shyam |   ( Updated:2021-11-15 02:37:48.0  )
కోటి రూపాయల ఎద్దు.. వీర్యానికి ఫుల్ డిమాండ్..
X

దిశ, ఫీచర్స్: బెంగళూరులో జరుగుతోన్న కృషి మేళాలో ‘కృష్ణ’ అనే పేరుగల మూడున్నరేళ్ల ఎద్దు ఆకర్షణీయంగా నిలిచింది. ‘హల్లికార్’ జాతికి చెందిన ఈ మూగజీవి ‘అన్ని పశువుల జాతులకు తల్లి’ వంటిదని దాని యజమాని బోరె గౌడ తెలిపాడు. ఈ సంతతికి చెందిన ఎద్దు వీర్యానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్న బోరె గౌడ.. ఒక్క డోసు వీర్యం రూ.1000లకు విక్రయించబడుతోందని వెల్లడించాడు.

‘కృషి మేళా’ కోసం ఈ ఏడాది 12,000 పైగా రైతులు(కృషి) నమోదు చేసుకోగా.. వారిలో చాలా మంది స్పాట్‌లోనే ఎద్దు వీర్యాన్ని విక్రయిస్తున్నారు. ఇక ఈ మేళాలోని మొత్తం 550 స్టాల్స్‌‌లో పశువులు, మెరైన్, పౌల్ట్రీ సహా సంప్రదాయ, హైబ్రిడ్ పంట రకాలు, వివిధ సాంకేతికతలతో కూడిన మెషినరీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కాగా ఈసారి విత్తనాలు, మొక్కలు, కోళ్ల విక్రయం ప్రధాన లక్ష్యంగా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న కృషి మేళా ప్రత్యేకత విషయానికొస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై లేకపోవడంతో ఆధునిక రైతుగా మారిన గిరిజన మహిళ శుక్రవారం మేళాను ప్రారంభించింది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రేమదాసప్ప జ్యోతి ప్రజ్వలన చేశారు.

Advertisement

Next Story

Most Viewed