రాబడి లేదు.. ఆదుకోండి: నిర్మలాసీతారామన్‌తో మంత్రి బుగ్గన

by srinivas |
రాబడి లేదు.. ఆదుకోండి: నిర్మలాసీతారామన్‌తో మంత్రి బుగ్గన
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయింది. ఇప్పటికే అప్పులు చేశాం. ఇంకా చేయాల్సి వస్తుంది. లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

ఢిల్లీలో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుగ్గన, ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌లు భేటీ అయ్యారు. ఏపీకి ఆర్థిక సహకారం, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై చర్చించారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed