ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 25వేల కోట్ల మూలధన సాయం

by Shamantha N |
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 25వేల కోట్ల మూలధన సాయం
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 ప్రభావం కారణంగా బ్యాంకుల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) పెరిగే అవకాశం ఉందని ఇటీవల పలు నివేదికలు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇదివరకే మొండిబకాయిలతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ పరిణామాలు మరింత భారం కానున్నాయి. ఈ సవాళ్ల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులను బయపడేసేందుకు ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో నిధులను సమకూర్చాలని భావిస్తోంది. ఏ కారణంగానైనా ప్రభుత్వ రంగ బ్యాంకులు బలహీనపడితే ఆర్థికవ్యవస్థకు విఘాతమని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అందించే రుణాలకు సంబంధించి ప్రైవేటు కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువగా నిధులను సమకూరుస్తాయి.

కాబట్టి మొండిబకాయిల సమస్యలను తీర్చేందుకు 2021-22 బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్ల వరకు చొప్పించాలని భావిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గత నెలలో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు 2020, సెప్టెంబర్‌లో 9.7 శాతం నుంచి 16.2 శాతానికి పెరగవచ్చని తన ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బడ్జెట్‌లో ఈ కేటాయింపులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం దాదాపు రూ. 2.6 లక్షల కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చొప్పించింది. ఈ నిధులతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, ఇటీవల కరోనా వల్ల మరోసారి ఎన్‌పీఏలు భారీగా పెరుగుతాయనే ఆందోళనలను వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed