- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్, చైనాకు దలైలామా హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, యుద్ధ వాతావరణాన్ని తలపించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితులపై బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవని… కయ్యానికి కాలుదువ్వుకోవద్దని హితవు పలికారు. పక్క దేశానికి నష్టం చేకూర్చాలని ఏ ఒక్క దేశం ప్రయత్నించినా… రెండు దేశాలు నష్టపోతాయని హెచ్చరించారు. ప్రపంచంలోనే ఈ రెండు దేశాలు అత్యంత పురాతనమైనవని, పురాతన చారిత్రక మూలాలను కలిగి ఉన్నాయని చెప్పారు. ఒక్కో దేశంలోనూ 100 కోట్లకు పైగా జనాభా ఉందని అన్నారు. ఇరు దేశాల మధ్య ఏదైనా పోటీ ఉంటే అది ఆరోగ్యకరంగానే ఉండాలని చెప్పారు.
శాంతికి చిహ్నమైన బౌద్ధానికి చైనా చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉందని… అలాంటి బౌద్ధానికి గురువైన బుద్ధుడి జన్మస్థలం భారత్ అని దలైలామా తెలిపారు. అందుకే ఈ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ, ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉండాలని హితవు పలికారు. 2011 నుంచి దలైలామా పాలనాపరమైన అంశాలపై వ్యాఖ్యానించలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై స్పందించారు.