‘కరోనాకు బదులు జగన్‌ జబ్బుకు మందు..’

by srinivas |
‘కరోనాకు బదులు జగన్‌ జబ్బుకు మందు..’
X

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ కరోనాకు మందు కనిపెట్టడం పక్కనబెట్టి సీఎం జగనుకు చేసిన జబ్బుకు మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. రిలయన్స్ అధినేత అనిల్ అంబానీతో జగన్ భేటీ అవడంపై వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘తండ్రిని చంపినవాడని ఆరోపించిన వ్యక్తిని పిలిచి సన్మానం చేసే జబ్బు ఏంటో, దాని లక్షణాలేంటో తెలుసుకునేందుకు రీసెర్చ్ జరుగుతోంది. ఆ రోజు ఇచ్చిన పిలుపుతో రెచ్చిపోయి రాళ్లేసిన వాళ్లు ఇంకా జైళ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ, జగ్గూ మాత్రం తండ్రి పోతేపోయాడు. బడుగు, బలహీన వర్గాలు బలైపోతే మనకేంటి అంటూ సన్మానాల్లో మునిగి తేలుతున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ హస్తముందనే ఆరోపణలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వై.ఎస్.ఆర్ అభిమానులు పెద్దఎత్తున రిలయన్స్‌కు చెందిన సంస్థలపై దాడులు చేశారు.

Advertisement

Next Story

Most Viewed