- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ ముఖంతో ఓట్లడుగుతావ్ జగన్ రెడ్డి: బుద్ధా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఒంటికాలిపై లేచే టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వరుస ట్వీట్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పాటు, జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మూడు ట్వీట్లు చేసిన ఆయన.. ’10 నెలల్లో ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న రాష్ట్రాన్ని నేల నాకించి తుగ్లక్ పేరుని సార్ధకం చేసుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను దెబ్బకొట్టి బీసీ ద్రోహిగా మిగిలిపోయాడు’ అంటూ తొలి ట్వీట్ చేసిన బుద్ధా మలి ట్వీట్‌లో..
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్ జగన్ రెడ్డి గారు? బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించాను అయినా ఓటు వెయ్యండి అని కాళ్లు పట్టుకుంటావా? మూడు ముక్కలాట మొదలెట్టి రాష్ట్రాన్ని నాశనం చేశాను క్షమించి ఓట్లు వెయ్యండి అని ప్రాధేయపడతావా?’ అని ప్రశ్నించారు.
దానికి కొనసాగింపుగా మూడో ట్వీట్‌లో.. ‘మద్యపాన నిషేధం పేరుతో ఇడుపులపాయలో తయారు అయ్యే చెత్త బ్రాండ్లను పోసి మీ పుస్తెలు తెంపుతున్నానని, అయినా అక్కా, చెల్లి సర్దుకుపోయి వైకాపాకి ఓటు వెయ్యమని దేహి అంటావా?’ అని అడిగారు. ఆ తరువాతి ట్వీట్‌లో..
‘ముద్దుల యాత్ర లో చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్, ఆరు లక్షల కోట్ల అవినీతి అని రెచ్చిపోయా రూపాయి కూడా అవినీతి జరిగినట్టు నిరూపించలేకపోయా మన్నించి ఈ సారికి గట్టెక్కించండి అని సాష్టాంగ నమస్కారం చేస్తావా? లేక విజయసాయిరెడ్డి గారిని నడిరోడ్డు మీద నిలబెట్టి ఈ చెత్తపనులకు ఆద్యుడు అంటూ బలిస్తావా?’ అని అన్నారు.
‘బ్యాంకుల్ని, దేశాలని బురిడీ కొట్టించి నిర్మించిన అక్రమ సామ్రాజ్యంలో సేదదీరుతున్నారు అన్న విషయం మర్చిపోతే ఎలా సాయన్నా.. ప్రపంచంలో ఎక్కడ స్కాం జరిగినా దాని వెనుక మూలాలు లోటస్ పాండ్‌లో ఉంటుంది. రస్ అల్ ఖైమాలో ఎవరు పట్టుబడినా ఇడుపులపాయ గ్యాంగ్ వణుకుతుంది ఎందుకు? హవాలా, మనీ లాండరింగ్, ఈడీ వంటి పదాలు ఉచ్ఛరించడానికి సిగ్గుగా లేదా? వీఎస్ రెడ్డిగారూ? ప్రజాధనాన్ని దొబ్బడానికి ఉన్న అన్ని అడ్డదారులు తొక్కి బొక్కలోకి వెళ్లిన జగన్ గారు నువ్వు బ్యాంకుల గురించి మాట్లాడితే మేము చెవిలో పువ్వు పెట్టుకుని వినాలా?’ అని ప్రశ్నించారు.
Tags: buddha venkanna, tdp, jagan, vijay sai reddy, ysrcp, twitter