టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు.. సీనియర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2021-03-29 07:35:06.0  )
టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు.. సీనియర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రాబోతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

‘టీడీపీలో వ్యవస్థాగత మార్పులు వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ సహా అనేకమంది రాబోతున్నారు. టీడీపీలోకి ఎంతోమంది వస్తారు.. రాబోతున్నారు’ అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాల్సిందేనని కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆశలు రేపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed