ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

by Shyam |
BSP leaders
X

దిశ, నల్లగొండ: బీఎస్పీ అధినేత్రి మాయావతి, తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఎస్పీ నేతలు ఖండించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునారావృతం అయితే ఊరుకోబోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషోర్‌ను హెచ్చరించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ ఎదుట సోమవారం ఎమ్మెల్యే గాదరి కిషోర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. నాయకులు కరణ్, సిద్దార్థ పూలే విలేకర్లతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని కోరుకుంటోందని, అది మింగుడు పడని దళిత ద్రోహి గాదరి కిషోర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బహుజన నేతలపై తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తే అడ్డుకుంటామని తెలిపారు. ఐపీఎస్‌కు ఆరేళ్ల గడువు ఉన్నా రిటర్మెంట్ ఇచ్చి ప్రజల్లోకి వచ్చారని, రెండేళ్ల గడువు ఉన్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? అని కిషోర్ కుమార్‌ను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు కిరణ్, కన్వీనర్ పూదరి సైదులు, స్వేరోస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, అనిల్ కుమార్, ఒంటెపాక యాదగిరి, పోలెపల్లి రాజేష్, కోటేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story