- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులపై టీఆర్ఎస్ సర్కార్ చిన్నచూపు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
దిశ, బేగంపేట: 1200 మంది బిడ్డల ప్రాణత్యాగం వల్ల ఏర్పడ్డ తెలంగాణ నేడు దొంగల చేతుల్లోకి వెళ్లిందని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో బీఎస్పీ హైదరాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల బతుకులను ఆగం చేస్తోందని మండిపడ్డారు. ఆయన కుటుంబాన్ని సేఫ్‌గా ఫామ్‌హౌజ్‌లో దాచి, పేదలను వరదనీటిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాల పిల్లలను కనీస విద్యకు నోచుకోకుండా, కార్మికులుగా, కర్శకులుగా మారి దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ.. బడుగుల బతుకులు మార్చడం అగ్రకుల పార్టీలతో సాధ్యం కాదన్నారు. బహుజనుల బాగుకోసం అత్యున్నత ఉద్యోగం వదిలి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తోనే సాధ్యం అన్నారు. ఆర్ఎస్‌పీ గొప్ప త్యాగధనుడు అని కొనియాడారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానంద్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, మంగారెడ్డి, సునీల్, చిరంజీవి, మహ్మాద్ అబ్రహర్, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతేగాకుండా.. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో హైదరాబాద్‌లోని వివిధ నియోజకవర్గాల నుంచి అనేకమంది యువత, మహిళలు బీఎస్పీలో చేరారు.