- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగ్రదాడులు.. చెనాబ్ నదిలో భారత జవాన్ల గస్తీ..
దిశ, వెబ్‌డెస్క్ :
ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశంలో ఉగ్రదాడులు జరిగే ఆస్కారం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.ఈనేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. పాక్ నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి అక్రమంగా చొరబడకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు సరిహద్దుల్లోని చెనాబ్ నదిలో పడవలపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
అత్యంత అధునాతన పడవల్లో Bsf జవాన్లు 24 గంటల పాటు నదిలో తిరుగుతూ పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఆగస్టు 15న భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సరిహద్దుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
సరిహద్దుల్లో సైనికుల పహారాను ముమ్మరం చేశారు. పుల్వామా జిల్లా కంరాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు బుధవారం ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ మరణించగా, మరో జవాన్ జులాజిత్ యాదవ్ బుల్లెట్ గాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోసారి దాడులు జరగకుండా ముందస్తు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.