దారుణం: చిన్నారులను హత్య చేసిన బాబాయ్

by srinivas |
దారుణం: చిన్నారులను హత్య చేసిన బాబాయ్
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా రేపల్లెలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులను దగ్గర బంధువు కిరాతకంగా చంపేశాడు. సీఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం వేజెండ్లకు చెందిన కొండేటి కోటేశ్వరరావు, ఉమాదేవి సంతానం పార్థివ్​ సాహసత్​ (10) రోహిత్​ తశ్విన్​(8) నేతాజీ నగర్‌లో నివాసం ఉంటున్న అమ్మమ్మ ఇంటికి చేరారు. ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలను ఉమాదేవి చెల్లెలి భర్త అయిన కాటూరి శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో తలుపులేసి కర్రతో కొట్టి హతమార్చాడు. ఉమాదేవి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ లాక్ డౌన్ కారణంగా పిల్లలతో తన తల్లి మోర్ల విజయలక్ష్మితో కలిసి ఉంటోంది. హత్యకు పాల్పడిన కాటూరి శ్రీనివాసరావు పోలీసులకు లొంగిపోయాడు. లాక్ డౌన్ వల్ల చాలాకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story