క్రికెట్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. హైదరాబాద్‌లో మల్టిప్లెక్స్ బిగ్ స్కీన్‌పై లైవ్ మ్యాచ్

by Anukaran |   ( Updated:2021-10-23 02:09:27.0  )
క్రికెట్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. హైదరాబాద్‌లో మల్టిప్లెక్స్ బిగ్ స్కీన్‌పై లైవ్ మ్యాచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ వచ్చేసింది. దుబాయ్ వేదికగా.. జరుగుతున్న T-20 వరల్డ్ కప్‌లో రేపు భారత్-పాక్ తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్ పై చూపించేందుకు హైదరాబాద్ వేదికకానుంది. తొలిసారిగా క్రికెట్‌ మ్యాచ్‌లను మల్టిప్లెక్స్‌ల్లో ప్రసారం చేయనున్నారు. ఆదివారం కావడంతో హోటళ్లు, థియేటర్లలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటిలాగే రెస్టారెంట్లలో టీవీల్లో క్రికెట్‌ ప్రసారం చేయనున్నారు. ఈక్రమంలో జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లలో మ్యాచ్‌ వీక్షణ కోసం బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలిలోని పబ్‌లలోనూ మ్యాచ్‌‌ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా హెచ్‌సీయూలో విద్యార్థి సంఘాలు సైతం భారీ స్క్రీన్‌లలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, దీనికి సంబంధించి మల్టిప్లెక్స్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ కప్ ఫైనల్స్ వరకూ అన్ని మల్టిప్లెక్స్‌ల్లో చూసేయొచ్చు.

Advertisement

Next Story

Most Viewed