1500 ఫేస్‌మాస్క్‌లతో వెడ్డింగ్ గౌన్

by Shyam |
dress-designer
X

దిశ, ఫీచర్స్: ‘పెళ్లి గౌను’ ప్రత్యేకంగా ఉండాలని వధువు కోరుకోవడం సాధారణమే. చాలామంది వారి వారి అభిరుచుల ప్రకారమే వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ చేయించుకుంటారు. అయితే యూకేకు చెందిన వెడ్డింగ్ ప్లానర్ వెబ్‌సైట్, సప్లయర్ మార్కె్టర్ హిచ్డ్ పూర్తిగా రీసైకిల్డ్ ఫేస్‌ మాస్క్‌లతో వెడ్డింగ్ గౌన్ రూపొందించి ఫ్యాషన్ ప్రియుల ప్రశంసలు అందుకుంటోంది.

కొవిడ్ -19 లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో యునైటెడ్ కింగ్‌డమ్‌ ప్రజలు ‘ఫ్రీడమ్ డే’ జరుపుకుంటున్నారు. అలాగే పండగలు, ఫంక్షన్లు, వివాహాల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా ఆలోచించిన హిచ్డ్.. కరోనా వల్ల మెడికల్ వేస్ట్ పెరిగిపోవడం, మాస్క్‌లను ఎక్కడపడితే అక్కడ పారేస్తూ పర్యవరణానికి హాని కలిగిస్తున్నారనే విషయం గమనించి 1500 అప్‌సైకిల్డ్ ఫేస్ మాస్క్‌లతో వెడ్డింగ్ డ్రెస్ రూపొందించింది. కాగా ప్రముఖ టీవీ, ఫిల్మ్ కాస్ట్యూమ్ డిజైనర్ టామ్ సిల్వర్‌వుడ్ ఈ స్పెషల్ డ్రెస్‌ను డిజైన్ చేశాడు.

UKలో వారానికి 100 మిలియన్ల డిస్పోజబుల్ మాస్క్‌లు రోడ్లపై పాడేస్తున్నారని, ఈ సమస్యకు పరిష్కారంగా మెడికల్ వ్యర్థాల(మాస్క్)‌తో వెడ్డింగ్ గౌన్ రూపొందించాం. ఆఫ్‌బీట్ బ్రైడల్ వేర్‌గా రూపొందించిన ఈ డ్రెస్ యువతనే కాకుండా, నెటిజన్లను కూడా విపరీతంగా ఆకర్షించింది. ఇక మిగిలిపోయిన పీపీఈ సామగ్రిని ఉపయోగించటానికి స్థిరమైన మార్గాన్ని కనుగొంటున్నాం. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా వివాహ వేడుకలు అంతగా జరగలేదు. ప్రస్తుతం కొవిడ్ ఆంక్షలు తొలగడంతో ఈ వేసవిలో వేలాది వివాహాలు జరగనున్నాయి. అందులో భాగంగానే కొత్తగా ఉంటుందని ఈ తరహా ప్రయోగం చేశాం. అంతేకాదు దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది’ అని హిచ్డ్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed