- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హార్స్ మిల్క్’కు ఫుల్ డిమాండ్..లీటర్ ఎంతంటే..
దిశ, ఫీచర్స్ : ఆవు, గేదె పాలను కొన్ని వేల ఏళ్ల నుంచే మనం ఆహారంలో భాగం చేసుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో మేక పాలు కూడా తాగుతుంటారు. ఇక వీటికి ప్రత్యామ్నాయంగా సోయా, బాదం పాలతో పాటు రీసెంట్‌గా వేగాన్ మిల్క్ అందుబాటులోకి వచ్చాయి. దమ్ము, దగ్గు ఉన్నవారికి గాడిద పాలు తాగిస్తుంటారు. కాగా బ్రిటన్‌లో తాజాగా ‘గుర్రం పాలు’ ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇంతకీ గుర్రం పాలు మంచివేనా? ఎవరు వీటిని విక్రయిస్తున్నారు? పరిశోధకులు ఏం చెప్తున్నారు? అనే విషయాలు మీ కోసం..
గుర్రం పాలు శతాబ్దాలుగా మధ్య ఆసియా వంటకాల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన 62 ఏళ్ల రైతు ఫ్రాంక్ షెల్లార్డ్ వీటిని బ్రిటన్లకు పరిచయం చేశాడు. సోమర్‌సెట్‌లో తన కుటుంబంతో జీవనం సాగిస్తున్న ఫ్రాంక్ 14 గుర్రాలను పెంచుకుంటున్నాడు. అతడు వాటిని సంరక్షించడంతో పాటు కొన్నేళ్ల నుంచి గుర్రం పాలను విక్రయిస్తున్నాడు. అలాగే గుర్రాలలో పాల దిగుబడి పెరిగేందుకు పలు పరిశోధనలు కూడా చేస్తున్నాడు. ఈ పాలలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని, టీ, కాఫీ, స్వీట్లలో ఈ పాలను వినియోగించొచ్చని అంటున్నాడు. ఈ పాలు ఎంతో ఆరోగ్యకరమని చెబుతూ, గుర్రం పాలు మంచివి కావనే భావనను తొలగించేందుకు ఫ్రాంక్ ప్రయత్నిస్తున్నాడు.
‘ఆవు పాలకు మంచి మార్కెటింగ్ ఉన్నందునే జనం ఆ పాలను తాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన సోయా, బాదం, వేగాన్ పాలను కూడా తాగుతున్నారు. ప్రజలకు ఎప్పుడూ ఆరోగ్య స్పృహ ఉంటుంది. వీటిని తొలిసారి తాగినప్పుడు బాదం రుచితో కాస్త తియ్యగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉండే ఈ పాలను ప్రస్తుతం 150 మందికి విక్రయిస్తున్నా. ఈ పాలల్లో విటమిన్ సీ అధికంగా ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. సంప్రదాయ పాల ఉత్పత్తులలో కనిపించే దానికంటే ఎక్కువ కేసిన్ వీటిలో ఉంటుంది’ అని ఫ్రాంక్ షెల్లార్డ్ చెప్పుకొచ్చారు. 250 మిల్లీ లీటర్ల గుర్రం పాలను 6.50 పౌండ్ల(రూ.656)కు విక్రయిస్తుండగా, లీటర్ ధర రూ.2,624. గుర్రం పాలు కజకిస్థాన్(Kazakhstan)లోనూ బాగా ప్రాచుర్యం పొందగా, అక్కడి నాజర్‌బాయేవ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, ఈ పాలపై పరిశోధనలు చేశారు. కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ పాలు దోహదపడతాయని వెల్లడించారు. ఆవు పాలతో పోలిస్తే మానవులకు అవసరమయ్యే అల్బుమిన్ ప్రోటీన్ గుర్రపు పాలలో ఎక్కువగా ఉన్నాయని తమ అధ్యయనంలో వివరించారు. ఈ ప్రోటీన్లు రక్తపోటును నియంత్రించడంలో సాయపడతాయని, ఆవు పాలు తాగని పిల్లలకు, గుర్రం పాలు చక్కని ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు.