- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆమె మత్తుకు.. ఐదుగురు యువకులు చిత్తు!
దిశ, వెబ్ డెస్క్: నువ్వంటే నాకిష్టం .. మనం పెళ్లి చేసుకుందాం అంది ఆ యువతి. ఇక ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవడంతో అబ్బాయి ఎగిరి గంతేసాడు. ఇంట్లో ఎలాగైనా ఒప్పించి పెళ్ళికి అన్ని సిద్ధం చేసాడు. మరో రెండు రోజుల్లో పెళ్లి అనగానే అబ్బాయి ఆకాశంలోనే మేడలు కట్టాడు. ఎప్పుడెప్పుడు పెళ్లి రోజు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూశాడు. ఇక ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు పెళ్లిరోజు రానే వచ్చింది. కుటుంబం, బంధువులతో సహా పెళ్ళికొడుకు అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాడు.అక్కడే అనుకోని ఒక ట్విస్ట్ అబ్బాయికి ఎదురైంది. వధువు ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్… ఏం చేయాలో పెళ్లి కొడుకుకు అర్ధం కాలేదు. ఇంకో కొన్ని గంటల్లో పెళ్లి అని మురిసిపోయిన అబ్బాయి ఆశలపై నీళ్లు చల్లి అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది. అది తన ఒక్కడినే కాదు మరో ఐదుగురికి ఇలాగే కుచ్చుటోపీ పెట్టిందని తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
ఈ కిలేడీ మోసం మధ్యప్రదేశ్ లోని భోపాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అందమైన ఒక అమ్మాయి పెళ్లి పేరిట అబ్బాయిలను అంమ్మించి, పెళ్లి వరకు తీసుకొచ్చి వారి వద్దనుండి పెళ్లి ఖర్చులకని భారీ మొత్తంలో డబ్బును తీసుకొని పెళ్లి రోజు పరారవుతున్నారు. ఇప్పటికీ ఇలాగే ఐదుగురు యువకులను, ఒక యువతి మోసం చేసింది. డబ్బున్నవారే ఆ అమ్మాయి టార్గెట్.. మత్తు మత్తు చూపులతో , మాయమాటలతో వారిని ముగ్గులోకి దింపి , వారి వద్దనుండి డబ్బులు గుంచుతున్నారు ఈ ముఠా. ఇక యువకులను మోసం చేస్తున్న ఆ యువతిని, వారి ముఠాను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.