పెళ్లి పీటల మీద పేపర్ పట్టుకున్న వరుడు.. పెళ్లి వద్దన్న వధువు

by Shamantha N |   ( Updated:2021-06-24 21:59:06.0  )
Bride Refusing to Marry Groom with Bad Eyesight
X

దిశ,వెబ్‌డెస్క్ : పెళ్లి పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం చాలా అరుదు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కారణాల వలన పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లి మండపంలోనే ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు మూడు నిమిషాల్లో తాళి కట్టాల్సిన సమయంలోనే పెళ్లిళ్లు ఆగిపోయి పోలీసు కేసుల దాక వెళ్తున్న సంఘటనలున్నాయి. అయితే తాజాగా కొద్దిసేపట్ల పెళ్లి జరుగుతుంది అనగా ఓ వధువు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఔరేయూ నగరంలో శివమ్ అనే వ్యక్తికి ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. అమ్మాయి అందంగా ఉండటంతో అబ్బాయి ఓప్పుకున్నాడు. అబ్బాయి పొడువు, తెల్లగా ఉడటంతో అమ్మాయికి నచ్చి అమ్మాయి తరఫున వారు పెళ్లికి ఓప్పుకున్నారు. ఆనందంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరికి పెళ్లి ముహుర్తం దగ్గరకు వచ్చింది. కుటుంబసభ్యులు అందరూ వచ్చి పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు. ఇక కాసేపట్లో వరుడు, వధువు మెడలో మూడుముళ్లు వేయడమే ఆలస్యం అంతలోనే వరుడికి వధువు ట్విస్ట్ ఇచ్చింది. అబ్బాయి కళ్లద్దాలు పెట్టుకొని అయోమయంగా కనిపించడం గమనించిది వధువు. దీంతో అనుమానం వచ్చి దగ్గరిలో ఉన్న ఓ పేపర్ తీసుకొచ్చి చదవమని అబ్బాయికి ఇచ్చింది. దాంతో అబ్బాయి పేపర్ ముందు పెట్టుకొని సైలెంట్‌గా కూర్చున్నాడు. దీంతో అబ్బాయికి చూపు సరిగా లేదని గ్రహించిన అమ్మాయి పెళ్లి పీటల మీద నుంచి లేచి పెళ్లి వద్దని చెప్పింది. అమ్మాయి కుటుంబసభ్యులు కూడా పెళ్లి వద్దని ఆపేశారు. దీంతో పెళ్లి పీటల మీదనే పెళ్లి ఆగిపోయింది.

Advertisement

Next Story

Most Viewed