- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికూతురి మెడలో పానీపూరీ హారం
దిశ, ఫీచర్స్: గోల్‌గప్పా, గప్‌చుప్, పానీపూరి.. పేరు ఏదైనా దీని రుచికి మాత్రం అందరూ ఫిదా కావాల్సిందే. అయితే పానీపూరి పెళ్లి విందులో పెట్టడం ఎప్పటినుంచో మొదలైంది కానీ వివాహంలో అదే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోవడం కాస్త విడ్డూరమే. అమ్మాయిలకు, పానీపూరికి విడదీయరాని సంబంధం ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. అందుకే కాబోలు.. పెళ్లి కూతురిగా చక్కగా ముస్తాబైన ఓ యువతి, వేదికపైనే గోల్ గప్పాలు లాగిస్తూ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక తన ప్రేయసికి వినూత్నంగా లవ్ ప్రపోజల్ చేద్దామనుకున్న ఓ ప్రేమికుడు.. ‘పానీపూరీలో ఉంగరం పెట్టి ప్రపోజ్’ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పెళ్లికూతురు పానీపూరిలనే ఆభరణాలుగా ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ వీడియో కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
భారతీయ పెళ్లీలంటేనే సరదాలు, సందళ్లు, పూల పందిళ్లు, ఆటవిడుపులు, గిల్లికజ్జాలు, సరదా సరదా సన్నివేశాల మేళవింపు. ఈ క్యూట్ మూమెంట్స్ ఎప్పుడూ నెటిజన్లకు ఆనందాన్ని పంచుతుంటాయి. ఈ క్రమంలోనే పెళ్లి వేదికగా జరిగే వినూత్న పోకడలు కూడా ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. అయితే అక్షయ అనే వధువు పానీ పూరిపై ప్రేమను చాటిచెప్పేందుకు తలపై పానీపూరి కిరీటంతో పాటు, మెడలో హారంగానూ ధరించి ఔరా అనిపించింది. భోజనం చేసే సమయంలోనూ ప్లేటు చుట్టూ పానీపూరీలతో డెకొరేట్ చేయడం విశేషం. రాబోయే రోజుల్లో మరెంతమంది యువతులు గోల్‌గప్పాతో కూడిన వెరైటీ ఆలోచనలతో ముందుకు వస్తారో వేచి చూడాలి.