- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై పోరాటంలో భారత్‌కు బ్రెట్‌లీ ఆర్థిక సాయం
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో ప్రతీ రోజు భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో చేరిన వారికి సరైన సమయంలో ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. దీంతో ఇండియా విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నది. ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున ఆడుతున్న పాట్ కమిన్స్ ఆక్సిజన్ దిగుమతి కోసం 50 వేల డాలర్లు పీఎం కేర్స్‌కు విరాళం అందించాడు. సహచర క్రికెట్లు, ఇతరులు కూడా భారత్‌కు సాయం చేయాలని కమిన్స్ పిలుపునిచ్చాడు.
అతడి విరాళానికి స్పూర్తి పొందిన మాజీ ఆసీక్ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ బ్రెట్‌లీ తన వంతు సాయం ప్రకటించాడు. భారత ప్రభుత్వానికి 1 బిట్ కాయిన్ (ప్రస్తుతం రూ. 48 లక్షల విలువ) విరాళం ప్రకటించాడు. ‘ఇండియా నాకు రెండో మాతృదేశం లాంటిది. ఇక్కడి ప్రజల నుంచి ఎంతో ప్రేమను పొందాను. ఇండియాతో తనకు ఎంతో బంధం ఉన్నది. నన్ను ఎంతో ఆదరించిన ప్రజలు కష్టాల్లో ఉంటే వదిలేయలేను. భారత్‌లో ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి తన వంతు సాయంగా ఒక బిట్ కాయిన్ విరాళంగా ఇస్తున్నాను’ అని బ్రెట్ లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. బ్రెట్ లీ మంచి మనసుకు ఎంతో మంది అభినందిస్తున్నారు.