- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ టెన్త్ విద్యార్థులు అలెర్ట్.. పరీక్షల షెడ్యూల్ ఖరారు..
దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షలను మే 11 నుంచి నిర్వహించనున్నట్లు బోర్డ్ఆఫ్సెకండరీ ఎడ్యకేషన్అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం బోర్డు డైరెక్టర్ఒక ప్రకటన విడుదల చేశారు. మే 11 నుంచి మే 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్కొనసాగనుంది. ప్రతి పేపర్‌కు 3 గంటల 15 నిమిషాలుగా నిర్ణయించారు. మొదటి 2 గంటల 45 నిమిషాలు పార్ట్‌ఏ కు కేటాయించగా.. పార్ట్‌బీ ఆబ్జెక్టివ్‌కు చివరి 30 నిమిషాలుగా నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఓపెన్ఎస్సెస్సీ అభ్యర్థులందరికీ ఒకే సిలబస్ఉంటుందని స్పష్టం చేశారు. నిర్ణయించిన పరీక్షల తేదీల్లో ఏదైనా పబ్లిక్, జనరల్ హాలిడే ఉన్నట్లయితే వాటిని విరమించుకోవాలని, షెడ్యూల్‌ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. విద్యార్థులకు కేటాయించిన కాంబినేషన్ సెట్(ప్రశ్నాపత్రం)కాకుండా ఇతర కాంబినేషన్సెట్వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్..
మే 11 : తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్)
మే 12 : హిందీ (సెకండ్లాంగ్వేజ్పేపర్)
మే 13 : ఇంగ్లిష్(థర్డ్లాంగ్వేజ్ పేపర్
మే 14 : మ్యాథ్స్ పేపర్
మే 16 : జనరల్సైన్స్(ఫిజికల్సైన్స్, బయాలాజికల్సైన్స్)
మే 17 : సోషల్స్టడీస్
మే 18 : ఓపెన్ఎస్సెస్సీ మెయిన్లాంగ్వేజ్ పేపర్1(సంస్కృతం, అరబిక్)
మే 19 : ఓపెన్ఎస్సెస్సీ మెయిన్లాంగ్వేజ్ పేపర్1(సంస్కృతం, అరబిక్)
మే 20 : ఎస్సెస్సీ వొకేషనల్కోర్స్థియరీ