- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంపై సీఎం కేసీఆర్ ఉద్యమ బాట.. ఎల్లుండి మంత్రులతో ఢిల్లీకి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కేంద్రంపై మరోసారి యుద్ధానికి దిగారు. ఎర్రవెల్లిలో మంత్రులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఈనెల 21న టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకావాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు తెరాస జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సమావేశంలో చర్చించనున్నారు. పంజాబ్ తరహాలో 100 శాతం వరిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సమావేశం అనంతరం అదేరోజు సీఎం కేసీఆర్‌తో కూడిన మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలవనున్నారు.