- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికో ప్రీతి కేసు: నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించి మెడికో విద్యార్థి ప్రీతి మృతి కేసులో నిందితుడు డాక్టర్ సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. సైఫ్‌కు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర. రూ.10 వేలు, ఇద్దరు పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. 16 వారాల పాటు ప్రతి శుక్రవారం కేసు విచారణ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది.
ప్రీతి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయొద్దని.. ఒక వేళ షరతులు ఏమాత్రం ఉల్లంఘించినా బెయిల్ ను వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించింది. ఫిబ్రవరి 22న మెడికో విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 24న నిందితుడైన డాక్టర్ సైఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. 26న హైదరాబాద్‌లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రీతి తుది శ్వాస విడిచింది.