కూతురితో ఫైట్ చేస్తున్న మహేష్ బాబు.. పిక్స్ వైరల్

by Disha News Web Desk |
కూతురితో ఫైట్ చేస్తున్న మహేష్ బాబు.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ముద్దు ముద్దు మాటలతో క్యూట్ వీడియోలు షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకున్న ఆమె.. సండే స్పెషల్ ఫొటోస్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. ఉదయం నిద్రలేవగానే బెడ్‌పై తండ్రి‌తో ఫైట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. 'నాన్నకు ప్రశాంతంగా అనిపించే రోజును సంపూర్ణంగా చెడగొట్టే లక్ష్యంతో' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రిన్స్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక ఈ ఫొటోలో ఉన్నది గౌతమ్ అనుకున్నామని, పరిశీలించి చూస్తే గానీ మహేష్ బాబుని గుర్తుపట్టలేకపోయామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CZ5_1xUvjgW/?utm_source=ig_web_copy_link


Advertisement

Next Story