ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. కీలకంగా మారిని సూసైడ్ నోట్..

by Disha News Web Desk |
ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. కీలకంగా మారిని సూసైడ్ నోట్..
X

దిశ, వెబ్‌డెస్క్: 25 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నంద్ గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌నగర్‌లో ఆయుషి అనే ఫ్యాషన్ డిజైనర్ తల్లిదండ్రులతో కలసి గత రెండు సంవత్సరాలుగా నివసిస్తోంది. కాగా, ఆయుషి సోమవారం రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి.. రాత్రి 8గంటల సమయంలో 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు మృతురాలి తల్లికి విషయం చెప్పాగా.. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒకటిన్నర పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ లేఖలో ఆయుషి తండ్రితో వివాదాలు ఉన్నాయని.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో సరిగ్గా రాణించలేకపోతున్నానని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. చేతి రాత నిపుణులు లేఖను పరిశీలిస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు.



Advertisement

Next Story