Minister Roja : ఎన్నికల వేళ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు.. వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-01-23 10:49:23.0  )
Minister Roja : ఎన్నికల వేళ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు.. వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మె్ల్యేలకు టికెట్ నిరాకరిస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి రోజా ఊహించని పరిణామం ఎదరైంది. పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మంత్రి రోజా, అతడి సోదరిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు రిజర్వేషన్ కలిసి రావడంతో పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్ పదవి ఇప్పిస్తామని చెప్పి తమను పెద్ద మెత్తంలో డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు.

అయితే, వారు రూ.70 లక్షలు ఇవ్వమని అడగ్గా.. తాము రూ.40 లక్షలు ముట్టజెప్పినట్లుగా భువనేశ్వరి వెల్లడించారు. మంత్రి సోదరుడు కుమార స్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి మూడు దఫాలుగా రూ.40 లక్షలు ఇచ్చామని స్పష్టం చేశారు. అయినప్పటికీ చైర్మన్‌ పదవి ఇవ్వకపోగా.. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని ఇవాళ భువనేశ్వరి ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం జగన్ మంత్రి రోజాకు టికెట్ ఇస్తారా.. లేక మరొకరికి కట్టబెడతారా.. అన్న విషయం నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story