ఏపీ, కర్నాటక బస్సు సర్వీసులకు బ్రేక్..

by srinivas |
ఏపీ, కర్నాటక బస్సు సర్వీసులకు బ్రేక్..
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మూలంగా ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలను కూడా ప్రభుత్వాలు రద్దు చేశాయి. కాగా ఇటీవల కొంచెం మెరుగుపడటంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్, కర్నాటక మధ్య రాకపోకలకు రాష్ట్రప్రభుత్వం అనుమతులిచ్చింది. కాగా ఏపీలో కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో మళ్లీ అంతర్రాష్ట బస్సలను ప్రభుత్వం నిలిపివేసింది. అంతేగాకుండా బెంగళూరులో లాక్‌డౌన్ విధించడంతో 23 బస్సులను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా రేపటి రాత్రి(మంగళవారం)వరకూ 140 బస్సుల సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్నవారికి డబ్బులు రిఫండ్ చేస్తామని ఏపీ ఆర్టీసీ ఈడీ తెలిపారు. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక మళ్లీ బస్సులు నడుపుతామని అన్నారు. అంతర్రాష్ట బస్సులేకాకుండా ఏపీలోనూ కొన్ని జిల్లాల్లో బస్సులను నిలిపివేశామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed