- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యులకేనా.. టీఆర్ఎస్ నేతలు మాస్కులు పెట్టుకోరా..!
దిశ, జవహర్ నగర్: ఎన్నికల ప్రచారమో, విజయోత్సవ సంబరాలు అనుకుంటే పొరపాటే..! ఆదివారం జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రహదారి పనుల శంకుస్థాపనకు వస్తున్న మంత్రికి స్వాగతం పలికేందుకు స్థానిక పాలక వర్గాలు, తెరాస శ్రేణులు ఆర్భాటం, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కొవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారు.
తెరాస నాయకులే కాదు, ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సైతం కొవిడ్ నిబంధనలపై దృష్టి సారించకపోవడంతో కరోనా సోకెందుకు సుమార్గాలకు ఈ గుమిగూడిన తీరే నిదర్శనం అవుతుంది. మాస్క్ లు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా డప్పు వాయిద్యాలు వాయిస్తూ, రోడ్డంతా గుమి కూడిన కార్యకర్తల సంబరాలు దేనికి సంకేతమో అర్థం కావడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ వేవ్ కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ఈ లాంటి ఆర్భాటాలు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటించకుండా, డబ్బులిచ్చి వందల సంఖ్యలో ప్రజలను మోహరింపు చేసిన స్థానిక నాయకులకు అధికారులు ముందస్తు అనుమతులు ఎలా ఇచ్చారని అందరిలో ఆసక్తి కలిగించే విషయం. నిబంధనలు పాటించని వైనానికి పోలీస్ అధికారులు కూడా అవాక్కయ్యారు.