- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కనుల పండువగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన స్వయంభూ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నల్గొండ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు కొండపైన శనివారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కనుల పండుగగా జరిగిన ఆ దివ్య దృశ్యాన్ని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలోని పలు జిల్లాల నుండి అశేష భక్త జనం తరలి వస్తున్నారు. చెర్వుగట్టు ప్రాంతమంతా శివనామ స్మరణతో మారు మ్రోగుతుంది.
స్వామివారికి తలంబ్రాలు సమర్పించేందుకు లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు. కొవిడ్ నియమాలు అమలు చేస్తూ భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులు ఖచ్చితంగా కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని అధికారులు ఆంక్షలు విధించారు. భక్తుల సౌకర్యం కోసం వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, తాగునీరు, టాయిలెట్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలతో సెక్యూరిటితోపాటు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.