ప్రియురాలిని స్నేహితులతో షేర్ చేసుకున్న ప్రియుడు

by Anukaran |   ( Updated:2021-04-22 02:27:29.0  )
ప్రియురాలిని స్నేహితులతో షేర్ చేసుకున్న ప్రియుడు
X

దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. అతివలపై మృగాళ్ల ఆగడాలకు అంతం లేకుండా పోతుంది. ప్రేమించలేదని, వేరే అబ్బాయితో చనువుగా ఉందని, పెళ్ళికి నిరాకరించిందని, కట్నం ఎక్కువ తీసుకురాలేదని, వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళలను పొట్టన పెట్టుకుంటున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను నమ్మించి గొంతు కోస్తున్నారు. తాజాగా ప్రేమించిన అమ్మాయిపై స్నేహితులతో సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను హత్యచేశాడు ఓ కిరాతకుడు. ఈ దారుణ ఘటన పుదుచ్చేరిలో వెలుగు చూసింది.

పుదుచ్చేరి సంత పుదుకుప్పంకు చెందిన రామన్‌ కుమార్తె ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అదే కాలేజ్ లో చదువుతున్న పృథ్విష్ అనే యువకుడు, యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం కాలేజ్ కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బాలిక, పృథ్విష్ తో పాటు కలిసి బయటికి వెళ్ళింది. ఈ క్రమంలో పృథ్విష్‌, బాలికని తన స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై సాముహిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు షాక్ అయిన బాలిక వారిని ప్రతిఘటించింది. బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పృథ్విష్, అతని స్నేహితులు ఆమెను బండ రాయి తో కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాలిక మృతి చెందడంతో ఆమె మృతదేహాన్ని మూట కట్టి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.

అటవీ ప్రాంతంలో తిరిగే గిరిజనులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే హత్య చేసిన పృథ్విష్, హత్యానంతరం లాయర్ దగ్గరకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం అప్పీలు పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లాయర్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed