కాంట్రవర్సీలో ‘ఏ సూటబుల్ బాయ్’

by Anukaran |   ( Updated:2020-11-22 04:25:11.0  )
కాంట్రవర్సీలో ‘ఏ సూటబుల్ బాయ్’
X

దిశ, వెబ్‌డెస్క్: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ఏ సూటబుల్ బాయ్’ చిక్కుల్లో పడింది. విక్రమ్ సేతు నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కాంట్రవర్సీ ఎదుర్కొంటోంది. ఈ సిరీస్‌లోని సీన్స్ ‘లవ్ జిహాద్’ను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడుతున్న నెటిజన్లు ‘బాయ్ కాట్ నెట్‌ఫ్లిక్స్’కు తెరలేపారు.

మీరా నాయర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్‌లో19 ఏళ్ల లిటరేచర్ స్టూడెంట్.. కుటుంబ బాధ్యతలతో పాటు తనను ఫాలో అవుతున్న ముగ్గురు అబ్బాయిలతో రొమాన్స్ మధ్య నలిగిపోతుంది. ఇదే సిరీస్ కథ కాగా.. లత ఆలయ పరిసరాల్లో బాయ్ ఫ్రెండ్‌ను కిస్ చేసే సీన్2పై మండిపడుతున్నారు హిందువులు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచేలా సన్నివేశాలు తెరకెక్కించారని ఫైర్ అవుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ శివాలయంలో ఈ షూటింగ్ జరిగినట్లు తెలుస్తుండగా.. బిజెపి లీడర్ గౌరవ్ తివారి మధ్యప్రదేశ్ రెవ పోలీస్ స్టేషన్‌లో నెట్‌ఫ్లిక్స్‌పై కేసు పెట్టారు. అంతేకాదు ‘ఏ సూటబుల్ బాయ్’ కిస్ సీన్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆయన.. లవ్ జిహాద్‌ను ప్రోతహిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ను అన్ ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మేకర్స్ తమ కిస్ సీన్ క్రియేటివిటీని ఆలయ పరిసరాల్లో మాత్రమే ఎందుకు చూపించారు.. మసీదులో ఎందుకు చూపించలేకపోయారని ప్రశ్నించారు. #BoycottNetflix హాష్ ట్యాగ్‌తో ట్రెండ్‌కు తెరలేపగా ఇండియాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

ఆరు ఎపిసోడ్స్‌తో కూడిన ‘ఏ సూటబుల్ బాయ్’ నాలుగు ధనవంతుల కుటుంబాల అదృష్టం, అందులో భారతదేశ వైవిధ్యమైన సంస్కృతిని అన్వేషించే క్రమంలో రూపొందగా.. రామ్ కపూర్, షహాన గోస్వామి, తన్యా మనిక్తల, రసిక దుగ్గల్, నమిత్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Next Story

Most Viewed