బాయ్‌కాట్ ‘తాండవ్’

by Shamantha N |
బాయ్‌కాట్ ‘తాండవ్’
X

దిశ, వెబ్‌డెస్క్ ‌: 2020లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేశాయి. అందులో ‘పాతాళ్ లోక్’, ‘ఏ సూటబుల్ బాయ్’, ‘సడక్ 2’తో పాటు పలు చిత్రాలు కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాయి. ఈ ఏడాది తొలి బిగ్గెస్ట్ వెబ్ సిరీస్‌గా ‘తాండవ్’ జనవరి 15న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాగా, 2021 కూడా కాంట్రవర్సీతోనే మొదలైంది. ఈ వెబ్‌సిరీస్‌లో ‘హిందూ’ మనోభావాలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని..నెటిజన్లు ‘తాండవ్’ సిరీస్‌ను బాయ్‌కాట్ చేయాల్సిందిగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

రాజకీయాల నేపథ్యంలో పొలిటకల్ డ్రామాగా ‘తాండవ్’ తెరకెక్కగా, అలీ అబ్బాస్ జాఫర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్ ప్లే చేయగా, డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్ అయూబ్, డినో మోరియా, అనుప్ సోని, కృతిక కమ్రా ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇందులో హిందూ దేవతలను అపహాస్యం చేయడంతో పాటు, హిందూ సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉద్దేశపూర్వకంగా విభజనలు రేకెత్తించేలా సన్నివేశాలను చిత్రీకరించారని, ‘యాంటీ హిందూ సిరీస్’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘బ్యాన్‌ తాండవ్ నవ్’(#banTandavnow)బాయ్‌కాట్ తాండవ్ (#boycottTandav) అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను మైక్రోబ్లాగింగ్ సైట్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సిరీస్‌లో మరో కథానాయకుడిగా నటించిన అయూబ్ తన కాలేజీ థియేటర్ ఫెస్టివల్‌లో భాగంగా శివుడి పాత్రను పోషిస్తూ, ఆ సందర్భంగా తను సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో పాటు, తన అనుచరులను పెంచడానికి ఎలా ట్వీట్ చేయాలి? ఎలాంటి చిత్రాలను పోస్ట్ చేయాలో వివరించగా, ఆ వెంటనే అక్కడి ప్రేక్షకులు చాలా వివాదాస్పదమైన ‘ఆజాది’ శ్లోకాలు చదువుతారు. ఇది హిందూ మనోభావాలను కించపరచడమేనని, మరో సందర్భంలో ‘దిగువ కుల పురుషుడు ఉన్నత కులానికి చెందిన స్త్రీని డేటింగ్ చేసినప్పుడు, అతను కేవలం ఒక మహిళ ద్వారా శతాబ్దాల అణచివేతకు ప్రతీకారం తీర్చుకుంటాడు’ అంటూ నిమ్నకులాలు, ఎగువ కులాలను వేరు చేసే డైలాగ్స్ ఉండటం, మతపరమైన సంభాషణలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈ వెబ్ సిరీస్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఇంకెంత కాలం హిందువులు కాంప్రమైజ్ కావాలి. బాలీవుడ్ హిందూ సంస్కృతిని డ్యామేజ్ చేస్తుంది. గట్టిగా ప్రతిధ్వనించండి..బాయ్ కాట్ తాండవ్’అని జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story