కిడ్నాప్‌కు యత్నం.. వెంబడించిన స్థానికులు

by Sumithra |   ( Updated:2020-10-23 03:54:54.0  )
కిడ్నాప్‌కు యత్నం.. వెంబడించిన స్థానికులు
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా వెంకటాపురంలో మరో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. వెంకటాపురానికి చెందిన నాగేశ్వరి అనే మహిళ నాలుగు నెలల క్రితం నాలుగు నెలల బాబును దత్తత తీసుకున్నారు. అయితే గురువారం రాత్రి బాబుతో కలిసి రోడ్డుపై వెళ్తుండగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాగేశ్వరిపై దాడి చేసి, బాబును ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయ్యి, కిడ్నాపర్లను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి, కిడ్నాపర్లను, పసికందును పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కిడ్నాప్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story