బలవంతంగా యువతికి తాళి కడుతుండగా.. చివరకు!

by srinivas |
బలవంతంగా యువతికి తాళి కడుతుండగా.. చివరకు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమ గోదావరిజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతి మెడలో బలవంతంగా తాళి కట్టేందుకు ఓ యువకుడు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన యువతి అతని నుంచి చాకచక్యంగా తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా ఆ యువకుడు కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. ఏలూరు బస్టాండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story