PUBG ఎంత పని చేసిందంటే..

by Anukaran |   ( Updated:2020-12-10 10:22:45.0  )
PUBG ఎంత పని చేసిందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : పబ్జీ గేమ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేటి యువత ప్రస్తుతం పబ్జీకి బానిసలుగా మారుతున్నారు. ఈ గేమ్ బారిన పడి ఇప్పటికే కొంత మంది వివిధ కారణల వలన ఆత్మహత్యలు చేసుకోగా, కేంద్రప్రభుత్వం పబ్జీ గేమ్‌ను ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.

అయితే, నిషేధానికి ముందు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న యువత మాత్రం ఇప్పటికీ PUBGని ఆడుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రం అవకాశం లేకుండా పోయింది.

తాజాగా పబ్జీ గేమ్ మరో బాలుడిని బలిగొంది. రాత్రిబవళ్లు గేమ్ ఆడుతూ ఓ బాలుడు వీడియో గేమ్‌కు బానిసలా మారాడు. చదువుకోకుండా ఎప్పుడూ గేమ్ ఆడుతుండటంతో తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో గురువారం రాత్రి వెలుగుచూసింది. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సూసైడ్ కు గల వివరాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed