బాలుడి ప్రాణం తీసిన సెల్‌ఫోన్

by Sumithra |
బాలుడి ప్రాణం తీసిన సెల్‌ఫోన్
X

దిశ, హుజుర్‌నగర్: మాయదారి సెల్‌ఫోన్ పిచ్చి అభం శుభం తెలియని ఓ బాలుడి ప్రాణాలు తీసింది.తాను అడిగిన మొబైల్ తండ్రి కొనివ్వలేదని మనస్థాపానికి గురైన అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..గ్రామానికి చెందిన నల్ల బోయిన వినోద్(11) ఇరవై రోజుల కిందట తండ్రిని టచ్ మొబైల్ కొనివ్వాలని అడిగాడు. అంత ఖరీదైన ఫోన్ తాను కొనివ్వలేనని తండ్రి చెప్పడంతో కలత చెందిన వినోద్ పురుగుల మందు తాగాడు. ఈ విషయం ఎవరికీ చెప్పక పోవడంతో ఆ బాలుడికి విరోచనాలు, వాంతులు అయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా కలుపు మందు తాగినట్లు చెప్పాడు. దీంతో అతన్ని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వినోద్ చనిపోయాడు. అయితే, తండ్రి శ్రీనివాస్ తల్లి భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో చనిపోగా, సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఉన్న ఒక్క కొడుకు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

Next Story