పెద్దపల్లిలో విద్యార్థి ఆత్మహత్య..

దిశ, వెబ్‌డెస్క్ :

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన మగ్గడి విష్ణు(11) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement