- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
న్యాయం కోసం వివేకా రక్తం ఘోషిస్తూనే ఉంది:వైఎస్ షర్మిల
దిశ, కడప: వివేకా రక్తం న్యాయం కోసం ఉక్రోషిస్తూనే ఉంది. వివేకాను ఘోరంగా చంపేశారు. చంపిన వాళ్ళు తలెత్తుకుని తిరుగుతున్నారు. ఇది ఎలా సాధ్యం అంటూ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల రెడ్డి బుధవారం పులివెందుల నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, న్యాయ నిర్ణేతలు మీరే, ఇక్కడ ఏ కొండా రెడ్డికో ఇంకెవరికీ భయపడాల్సిన పని లేదంటూ బరోసా ఇచ్చారు. ఇదే గడ్డ మీద మీ బిడ్డ బ్రతుకుతుంది. ఈ గడ్డ మీద వివేకా రక్తం న్యాయం కోసం అక్రోషిస్తునే ఉందని అన్నారు.
వైఎస్ఆర్‌కు వివేకా లక్ష్మణుడు లాంటివాడని, 40 ఏళ్లు ఈ గడ్డ అభివృద్ధి కోసం పని చేశారని అన్నారు. వివేకా హత్య విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయని, సీబీఐ దగ్గర అవినాష్ రెడ్డి నిందితుడు అని ఆధారాలు ఉన్నాయని, అన్ని ఆధారాలు ఉన్నా సీబీఐ అవినాష్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేదని షర్మిల ఆరోపించారు, ఆయన్ను సాక్షాత్తు సీఎం జగన్ కాపాడుతున్నారని, జగన్‌కి వివేకా సొంత బాబాయి అని, అలాంటి సొంత బాబాయిని హత్య చేస్తే సమాధానం లేదని అన్నారు. హంతకులను అరెస్ట్ కాకుండా చూస్తున్నారన్నారు. సాక్షి ఛానల్ హత్యను గుండెపోటుగా చిత్రీకరణ చేసిందని, ఎందుకు గుండెపోటుగా నడిపారో భారతి సమాధానం చెప్పాలని అడిగారు.
Read More...