SRH VS LSG: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన ఎస్ఆర్‌హెచ్.. ఇరు జట్లకు చావో..రేవో

by Disha Web Desk 1 |
SRH VS LSG: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన ఎస్ఆర్‌హెచ్.. ఇరు జట్లకు చావో..రేవో
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమతున్న ఎస్ఆర్‌హెచ్ మళ్లీ విజయాల బాట పడుతుందా అని ఫ్యాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు జట్టులో రెండు మార్పులు చేశారు. పేసర్ మార్క్ యాన్సన్ స్థానంలో శ్రీలంక స్పిన్నర్ విజయ్‌కాంత్ వియస్కాంత్, అదేవిధంగా బ్యాటర్ మయాంక్ స్థానంలో సన్వీర్ సింగ్ తుది జట్టుతో చేరారు. ఇక బౌలింగ్ విభాగంలో భూవి అదరగొడుతున్నాడు. ఇక లక్నో విషయానికి వస్తే.. ఆ జట్టు చివరగా ముంబై జట్టుతో తలపడి 98 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇక బ్యాటింగ్ విభాగంలో లక్నో బలంగా కనిపిస్తోంది. డికాక్, కెప్టెన్ రాహుల్, స్టోయినిస్, పూరన్ చక్కగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ఉమేష్ స్పెన్సర్ జాన్సన్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్లే ఆఫ్ చేరేందుకు ఈ మ్యాచ్ చాలా కీలకం కావునా ఇరు జట్టు తమ శక్తి మేర పోరాడే అవకాశం ఉండటంతో పోటి గట్టిగానే ఉండనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్

ఇంపాక్ట్ సబ్స్: గ్లెన్ ఫిలిప్స్, ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (W/C), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్

ఇంపాక్ట్ సబ్స్: మణిమారన్ సిద్ధార్థ్, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్, అష్టన్ టర్నర్, అమిత్ మిశ్రా

Next Story