నదిలో మునిగిన పడవ.. బాలుడు మృతి

by srinivas |   ( Updated:2021-08-04 04:52:12.0  )
నదిలో మునిగిన పడవ.. బాలుడు మృతి
X

దిశ, ఏపీ బ్యూరో : కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దాములూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానది ఒడ్డున పడవలో ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీమ్ బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే దామలూరు కృష్ణానది ఒడ్డున ఉన్న పడవలో ఆడుకునేందుకు 10 మంది చిన్నారులు ఎక్కారు. అయితే పడవ పక్కకు ఒరగడంతో చిన్నారులు నదిలో పడిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే 9 మందిని స్థానికులు రక్షించగా శర్వాన్ ఆనంద్ అనే బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్న రెస్క్యూ టీమ్‌కు శర్వాన్ ఆనంద్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Advertisement

Next Story