- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిశువు చనిపోయిందని కవర్లో ప్యాకింగ్.. 4గంటల తర్వాత
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. బతికున్న శిశువు చనిపోయాడంటూ వైద్య సిబ్బంది కవర్‌లో ప్యాక్ చేసి తండ్రికి అప్పగించారు. సరిగ్గా 4 గంటల తర్వాత చిన్నారి కదలికలను గుర్తించిన తండ్రి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు వైద్యం ప్రారంభించారు. ప్రస్తుతం శిశువును వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేస్తున్నారు. శిశువు ప్రాణాలతో పోరాడుతున్నట్లుగా సమాచారం. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నర్సింగ పురం గ్రామానికి చెందిన సునీత 6 నెలల గర్భవతి. శుక్రవారం నొప్పులు రావడంతో భద్రాచలం ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. నొప్పులు రావడంతో స్కానింగ్ చేసి ఇద్దరు కవలలు వున్నారని అందులో ఒకరు చనిపోయారని అబార్షన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసిన వైద్యులు మగ, ఆడ శిశువుగా చెప్పారు. కడుపులోనే ఇద్దరు మరణించారంటూ సునీత భర్తకు తెలిపారు. రెండు కవర్లలో వేర్వేరుగా ప్యాక్ చేసి పక్కన పెట్టేశారు. ఇదంతా ఉదయం 9గంటల సమయంలో జరగగా, మధ్యాహ్నం 12:30గంటల సమయంలో మగ శిశువు కవర్‌ను తాకిన శబ్దం, కదలికలను తండ్రి గమనించాడు. వెంటనే సిబ్బందికి విషయం తెలపడటంతో వైద్యం అందించడం మొదలుపెట్టారు. అయితే వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి నివేదిక అందజేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు.