- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నోటిఫికేషన్లు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి అవతల పడటంలో బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్ అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సోమవారం ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు వార్డు ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తాం అని మండలి సాక్షిగా చిన్న దొర కేటీఆర్ ప్రకటించినా.. నేటికీ ఆ ఉద్యోగాల ఊసే లేదని విమర్శలు చేశారు.
ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలతో పరిపాలన పడకేసిందని, అరకొర సిబ్బందితో ఇన్ చార్జీలతోనే నెట్టుకొస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఇలాకాలోనే ఇలా జరగడంపై హాస్యాస్పదమన్నారు. అయినా సీఎం కేసీఆర్ కు మాత్రం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనే స్పృహ లేకుండా పోయిందన్నారు. ఇదిలా ఉండగా ఆదివాసీల దినోత్సవం సందర్భంగా పోడు పట్టాల కోసం కొట్లాడుతున్న అడవితల్లి బిడ్డలు ఆదివాసీలకు అండగా తానుంటానని షర్మిల ట్వీట్ చేశారు. జల్, జంగల్, జమీన్ అంటూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కొట్లాడిన కొమురం భీమ్ వారసులుగా ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.
నేడు సిరిసేడుకు షర్మిల
నిరుద్యోగుల్లో భరోసా నింపేందుకు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షను చేపడుతున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం, సిరిసేడు గ్రామానికి చెందిన నిరుద్యోగి మహ్మద్ షబ్బీర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారి సమక్షంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు.