‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకావిష్కరణ

by Shyam |
‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకావిష్కరణ
X

దిశ, క్రైమ్ బ్యూరో: ప్రముఖ రచయిత మహమ్మద్ రియాజ్ అలీ రజ్వీ రచించిన ‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. గన్‌ఫౌండ్రీ మీడియా ప్లస్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ ముస్లీం మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మసూద్ జాఫ్రీ, కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ వై. సునీల్ రావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సి.విఠల్, ఉస్మానియా యూనివర్శిటీ ఉర్థూ విభాగం రిటైర్డ్ అధిపతి డాక్టర్ మాజిద్ బెదర్, పుస్తక రచయిత మహమ్మద్ రియాజ్ అలీ రజ్వీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story