- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు: బోండా ఉమ
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం దారుణంగా మార్చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్.. హత్యాచారాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని విరుచుకుపడ్డారు. విజయవాడలో శుక్రవారం బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ డ్రగ్స్ వ్యాపారం వల్ల ఏపీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. డీఆర్‌ఐ అధికారులు ఆంధ్ర బోర్డర్స్ అంటే జాగ్రత్తగా ఉండాలని పక్క రాష్ట్రాలను హెచ్చరిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ డ్రగ్స్ బిజినెస్‌ను డీజీపీ కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రూ. 9 వేల కోట్లు హెరాయిన్ దొరికితే.. దానికి ఏపీకి సంబంధం లేదని డీజీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్షాత్తు డీఐజీ ర్యాంకు అధికారులే గంజాయి కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాపై డీఆర్‌ఐ అధికారులు దృష్టి సారించాలని వైసీపీ నేతలతో పాటు పోలీస్ అధికారులను విచారించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.