- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగ్రా-కాన్పూర్ మెట్రో కోసం బొంబార్డియర్
దిశ, వెబ్‌డెస్క్: రైల్ టెక్నాలజీ లీడర్ బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ మరో భారీ ఒప్పందం చేసుకుంది. ఆగ్రా-కాన్పూర్ మెట్రో ప్రాజెక్టుల్లో భాగంగా.. 201 మెట్రో కార్లను నిర్మించి, పంపిణీ చేసే ఒప్పందాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆగ్రా-కాన్పూర్ మెట్రో ప్రాజెక్టులకు అధునాతన సిగ్నలింగ్ పరిష్కారం కానుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పోరేషన్ నుంచి లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్‌ఓఏ) అందుకుంది. ఈ లెటర్ విలువ రూ. 2051 కోట్లు ఉండగా.. కస్టమర్‌లకు అదనంగా 51 మెట్రో కార్ల ఎంపికను ఉపయోగించుకోవాలన్న నిబంధన ఉంది.
అంతేకాకుండా, 30 కిలోమీటర్ల ఆగ్రా మెట్రో, 32 కిలోమీటర్ల కాన్పూర్ మెట్రోలకు 67 బొంబార్డియర్ మోవియా మెట్రో త్రీకార్ ట్రైన్‌సెట్లు, అధునాతన సిటఫ్లో 650 రైల్ కంట్రోల్ సొల్యూషన్ కాంట్రాక్టులను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఈ సంస్థ ఉన్నది. ఈ ప్రాజెక్టులలో రెండు కారిడార్లు ప్రధాన పబ్లిక్ రోడ్లు, తాజ్ మహల్ సహా పర్యాటక ప్రదేశాలు మరియు సిటీ క్లస్టర్ ప్రాంతాలను కలుపుతాయి. ఫలితంగా రెండు నగరాలకు స్థిరమైన మరియు నమ్మదగిన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటుంది. కాన్పూర్‌లోని 40 లక్షల మందికి, ఆగ్రాలోని 20 లక్షల మంది ప్రయాణికులకు.. ఈ మెట్రో మెరుగైన కనెక్టివిటీతో పాటు అనుభవాన్ని మెరుగుపరచనుంది.
భారతదేశంలోని వడోదర సమీపంలోని బొంబార్డియర్ సావ్లి, మనేజా సైట్లలో రైళ్లను తయారు చేయనున్నాయి. అయితే, ‘మేక్ ఇన్ ఇండియా’ మార్గదర్శకాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. ఇందులో భాగంగానే రోలింగ్ స్టాక్‌ను హైదరాబాద్‌లోని గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌లో రూపొందించడం గమనార్హం.