డ్రగ్స్ కేసులో తెరపైకి ‘నమ్రత శిరోద్కర్’ పేరు..!

by Anukaran |   ( Updated:2020-09-22 06:30:00.0  )
డ్రగ్స్ కేసులో తెరపైకి ‘నమ్రత శిరోద్కర్’ పేరు..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బోర్డు అధికారులు (NCB) విచారించగా ఆమె పలువురు ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇవాళ ఉద‌యం దీపికా పదుకొనే, ఆమె మేనేజర్ కరీష్మాకు ఎన్సీబీ అధికారులు నోటిసులు జారీ చేశారు.

కాగా, ఇవాళ సాయంత్రం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భార్య‌, ‘న‌టి న‌మ‌త్ర శిరోద్కర్’ పేరు కూడా డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న వారి లిస్టులో ఉంద‌ని కొన్ని ఛాన‌ల్స్ ప్ర‌చారం చేశాయి. ఆమె సుశాంత్ మాజీ మేనేజ‌ర్ ‘జ‌యా సాహా’తో చాటింగ్ చేసింద‌ని.. ‘మంచి ఎండీ ఎప్పుడిస్తావ్, నాకు ఇస్తాన‌ని ప్రామిస్ చేశావంటూ మెసెజ్ చేసింద‌ని అధికారులు గుర్తించినట్లు ప్ర‌చారం సాగుతుంది. మంచి ఎండీ ఇచ్చాక నీకు సూప‌ర్ పార్టీ ఇస్తాన‌ని న‌మ‌త్ర చెప్పిన‌ట్లుగా’ జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువడుతున్నాయి. ఇదిలాఉండగా, బాలీవుడ్‌లో ఇప్పటికే రియా చక్రవర్తి, రుకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, దీపికాపదుకొనే, శ్రద్ధాకపూర్ పేర్లు వెలుగులోకి రాగా, ఎస్సీబీ అధికారులు విచారణ నిమిత్తం సమన్లు జారీ చేశారు.

Advertisement

Next Story