బాలీవుడ్‌పై కరోనా పంజా.. అక్షయ్ కుమార్‌కు పాజిటివ్

by Anukaran |
బాలీవుడ్‌పై కరోనా పంజా.. అక్షయ్ కుమార్‌కు పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్ సినీ ఇండస్ట్రీలపై ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికే అలియా భట్‌, తాజాగా నివేదా థామక్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇవాళ(ఆదివారం) బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోవిడ్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ‘పరీక్ష చేస్తే.. ఈ రోజు ఉదయాన్నే నేను COVID-19 కు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, నేను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోండి. వైద్యుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను.’ అంటూ అక్షయ్ ట్వీట్ చేశారు.

https://twitter.com/akshaykumar/status/1378554562638798852?s=20

Advertisement

Next Story